
గుంటూరు జిల్లా తూళ్లూరులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. సీఎంతో పాటు స్పీకర్ కోడెల, పలువురు మంత్రులు పాల్గొన్నారు. టీడీపీ పంచాగకర్త తంగిరాల వెంకటకృష్ణ పంచాంగ శ్రవణం ఆలపించారు. ప్రభుత్వ కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవుతాయని ఆయన పేర్కొన్నారు. వర్షాలు పడతాయని.. వ్యవసాయం లాభసాటిగా జరుగుతుందని తెలిపారు.