Breaking News

తుమ్మిడిహెట్టి, కాళేశ్వరం బాధ్యతలు హరీష్ కు..

Kaleshwaram-project2

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ గోదావరి పై రీడిజైన్ చేసి నిర్మించనున్న ప్రాజెక్టులపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే తుమ్మిడిహెట్టి, కాళేశ్వరం ప్రాజెక్టులను జనవరినుంచే మొదలుపెట్టాలని సమీక్షలో సూచించారు. తుమ్మిడిహెట్టి ముంపుపై మహారాష్ట్ర సీఎం ఫడనవీస్ తో మాట్లాడారు. సమస్యల పరిష్కారంపై చర్చించడానికి మంత్రి హరీష్ ను మహారాష్ట్రకు పంపుతున్నట్టు పేర్కొన్నారు.

భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావుకు కాళేశ్వరం, తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుల బాధ్యతలను అప్పజెప్పారు. ఏకకాలం ఈసాగునీటి ప్రాజెక్టుల పనులు చేపట్టాలని కేసీఆర్ ఆదేశించారు. టీఆర్ఎస్ పాలన ముగిసే లోపు 2019లోగా కచ్చితంగా ప్రాజెక్టులు పూర్తిచేయాలని కేసీఆర్ ప్రకటించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *