Breaking News

‘తీన్మార్ మల్లన్న’కు కాంగ్రెస్ ఎమ్మెల్సీ టికెట్

teenmaar mallanna

హైదరాబాద్, ప్రతినిధి : v6చానెల్ లో వచ్చే ఫన్నీ పొలిటికల్ సెటైరికల్ షో ‘తీన్మార్’ ఇందులో ఒక ముసలోడి లాగా తన పంచ్ డైలాగులతో అలరించిన ‘తీన్మార్ మల్లన్న’ అలియాస్ నవీన్ కుమార్ కు అదృష్టం తలుపుతట్టింది. మల్లన్నగా పొలిటికల్ నాయకులతో సన్నిహిత్యం ఆయనకు పదవిని తెచ్చిపెట్టింది. వీ6 చానల్ ఎండీ అయిన మాజీ ఎంపీ వివేక్ సాయంతో మల్లన్న పీసీసీ చీఫ్ పొన్నాలతో సాన్నిహిత్యం పెంచుకున్నారు. అప్పట్లో కరీంనగర్ వచ్చిన సోనియాను కలిశారని.. అలా అలా సాగిన మల్లన్న జర్నలిస్ట్ ప్రస్థానం చివరకు ఎమ్మెల్సీ టికెల్ వరకు వచ్చింది.

తీన్మార్ మల్లన్న అలియాస్ నవీన్ కుమార్ కు కాంగ్రెస్ ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చింది. వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టుభద్రుల స్థానానికి మల్లన్న టికెట్ ఖరారు చేస్తూ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. అంతేకాదు.. నిన్న పీసీసీలో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ అధిష్టానం దూత కుంతియా చేతులమీదుగా మల్లన్న బీ ఫామ్ కూడా అందుకున్నారు. త్వరలో జరిగే ఎమ్మెల్సీ పట్టుభద్రుల ఎన్నికల్లో మల్లన్న పోటీ పడనున్నారు..

మొత్తానికి జర్నలిజం లో అడుగుపెట్టి మల్లన్నగా పేరుప్రఖ్యాతలు పొందిన నవీన్ కుమార్ ఆ తర్వాత తన ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయ ప్రయత్నాలు చేశారు. కాంగ్రెస్ తో సాన్నిహిత్యంతో ఆయనకు ఎమ్మెల్సీ టికెట్ ఆయాచిత వరంలా వచ్చింది. వచ్చే ఎన్నికల్లో యూత్ లో ఫుల్ ఫాలోయింగ్ ఉన్న మల్లన్న మరి గెలుస్తాడో లేదో చూడాలి..

 

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *