
తీగల వంతెన అప్రోచ్ రోడ్డు పనులను త్వరగా పూర్తచేయాలి
నాణ్యత ప్రమాణాలు పాటించాలి
జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్
కేబుల్ బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు పనులను త్వరగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ అధికారులను ఆదేశించారు.
గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెవెన్యూ, ఆర్ అండ్ బి అధికారులు, గుత్తేదారులతో కేబుల్ బ్రిడ్జ్ అప్రోచ్ రోడ్డు పనులపై సమీక్షించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ తీగల వంతెన అప్రోచ్ రోడ్డు నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తిచేయాలని, నాణ్యత ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని అన్నారు. వంతెన వద్ద వియూపి (వెహికిల్ అండర్ పాస్) పనులు సదాశివపల్లె, బోమ్మకల్ వద్ద పనులను పూర్తిచేయాలని అన్నారు. నిర్మాణ పనులను సకాలంలో పూర్తిచేయడానికి 24 గంటల పాటు పనులు నడిచేలా అవసరమైన లేబర్ ను నియమించుకొవాలని సూచించారు. అప్రోచ్ రోడ్డు మధ్యలో ఉన్న విద్యూత్ స్తంభాలను తొలగించే పనుల కోసం వెంటనే టెండర్లను పిలిచి పనులను ప్రారంభించాలని అన్నారు.
జిల్లా కలెక్టర్ అంతకుముందు కమాన్ నుండి తీగలవంతన వరకు అప్రోచ్ రోడ్డు పనులు పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్, జి వి శ్యాంప్రసాద్ లాల్, ఆర్ అండ్ బి ఈఈ సాంబశివరావు, ఆర్డిఓ ఆనంద్ కుమార్, తహసిల్దార్ సుధాకర్, ఆర్ అండ్ బి డిఈలు,ఏఈ లు కాంట్రాక్టర్ కమాలోద్దీన్ తదితరులు పాల్గొన్నారు.