
తిరుపతి , ప్రతినిధి : తిరుమలలో బాంబు పెట్టారన్న వార్త కలకలం సృష్టించింది. తిరుమలలో పలు చోట్ల బాంబు పెట్టామంటూ ఓ అజ్ఞాత వ్యక్తి నుంచి వచ్చిన ఫోన్ కాల్తో భద్రతా సిబ్బంది ఉరుకులు పరుగులు పెడుతున్నారు. శ్రీవారి ఆలయం, అన్నప్రసాద కేంద్రం, బస్టాండ్ ప్రాంతాల్లో బాంబు స్క్వాడ్ ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు. నాలుగు బృందాలుగా విడిపోయిన పోలీసులు అణువణువూ గాలిస్తున్నారు. కర్ణాటక నుంచి వచ్చిన ఫోన్ కాల్ ఆధారంగా పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.