Breaking News

తిరుపతి నుంచి సుగుణమ్మ ఘన విజయం

sugunamma

తిరుపతి : టీడీపీ ఎమ్మెల్యే వెంకటరమణ మృతితో ఖాళీ అయిన తిరుపతి ఉప ఎన్నిక ఇటీవల జరిగిన విషయం తెలిసిందే.. ఈ ఉప ఎన్నికలలో సోమవారం ఓట్లలెక్కింపులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సుగుణమ్మ ఘనవిజయం సాధించారు. ఆమె తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి శ్రీదేవిపై 1,16,524 ఓట్ల తేడా ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి డిపాజిట్ కూడా దక్కలేదు.

కాగా ఈ ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యే మృతికి సంతాపంగా వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ బరిలోకి దిగక సపోర్ట్ చేసింది. కానీ కాంగ్రెస్ పార్టీ పోటీ చేయడంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి. కానీ కాంగ్రెస్ ను జనాలు చావు దెబ్బ తీశారు. కాంగ్రెస్ అభ్యర్థికి కేవలం 9628 ఓట్లు మాత్రమే వచ్చాయి.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *