Breaking News

‘తిడితే కేసీఆర్ లా తిట్టాలి.. పడితే పౌరుషం లేని ఆంధ్రా ఎంపీల్లా పడాలి’

pawan-kalyan-kcr-same-to-same

‘బంగారం’ భలే మాట చెప్పాడుల్లా.. కేసీఆర్ ను మొదటిసారి మెచ్చుకున్నాడు. ఒకసారి కాదు… నిన్నటి ప్రెస్ మీట్ లో రెండు సార్లు మెచ్చుకున్నాడు. ఆంధ్రా ఎంపీలు తన ఏపీ రాష్ట్రం కోసం పోరాడడం లేదని.. వారందరూ వ్యాపారవేత్తలు కావడంతో వ్యాపారం మీద ఉన్న ద్యాస ఆంధ్ర ప్రదేశ్ పై లేదని దుయ్యబట్టారు. ఆ క్రమంలోనే ‘తిడితే కేసీఆర్ లా తిట్టాలి.. పడితే పౌరుషం లేని ఆంధ్రా ఎంపీల్లా పడాలి’ అని ఆయన విరుచుకుపడ్డారు.

ఇక తెలంగాణ కోసం పోరాడుతున్న తెలంగాణ ఎంపీలను చూసి ఆంధ్రా ఎంపీలు బుద్ధి తెచ్చుకోవాలని పవన్ సూచించారు. అంతేకాదు.. యాదాద్రి కోసం విజయనగరంకు చెందిన అర్టిటెక్ట్ నియమించిన కేసీఆర్ తెలుగు జాతి ఐక్యతకు కృషి చేస్తున్నాడని ప్రశంసించారు. పవన్ నోట కేసీఆర్ మాట పాజిటివ్ గా రావడంతో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అయ్యింది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *