
తెలంగాణలో తాగుబోతులకు పాత విధానాన్నే కొనసాగిస్తున్నారు కేసీఆర్.. మద్యం పాలసీని గత ప్రభుత్వం అనుసరించిన విధానాన్నే కొనసాగించాలని నిర్ణయించారు. కేసీఆర్ చైనా పర్యటనకు ముందే ఈ నూతన మద్యం విధానాన్ని ఖరారు చేశారు. మద్యం దుకాణాలకు అక్టోబర్ నుంచి రెండేళ్ల కాలపరిమితో లైసెన్సులు జారీ చేస్తారు.
దీంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలనుకున్న చీప్ లిక్కర్ విధానానికి ముగింపు పలికినట్టైంది.. వైన్స్ షాపులకు దరఖాస్తులు ఎక్కువగా వస్తే లాటరీ ద్వారా ఎంపికచేస్తారు.