తాగునీటి సంరక్షణ, స్వఛ్చ భారత్ పై అవగాహన కోసం…

తెలంగాణలోని ఇంటింటికి సురక్షిత మంచినీటిని అందిస్తున్న గ్రామీణ తాగునీటి సరాఫరా విభాగం, నీటి వినియోగం, సంరక్షణ పై ప్రజలను చైతన్యపరిచేందుకు సమగ్ర కార్యచరణ రూపొందించింది. రాష్ట్రంలోని 438 మండలాలు 8700 పంచాయితీల్లోని విలేజ్ అండ్ వాటర్ శానిటేషన్ కమిటీలకు సురక్షిత తాగునీటి పద్దతులు , తాగునీటి సంరక్షణ, స్వఛ్చ భారత్ పై అవగాహన కల్పించబోతుంది. సాక్షర భారత్ కార్యక్రమంలో యాక్టీవ్ గా పనిచేస్తున్న 60 మంది మండల స్థాయి కో ఆర్డినేటర్స్ ను ఇందుకోసం ఎంపిక చేసింది. వీరందరికి రాజేంద్రనగర్ సిపార్డ్ లో మూడు రోజుల పాటు శిక్షణ ఇస్తుంది. 30 మంది సభ్యులతో నిన్న ఒక బ్యాచ్ కు శిక్షణ మొదలైంది. ఇవాళ రెండో బ్యాచ్ శిక్షణ కార్యక్రమాన్ని RWS&S ఈ.ఎన్.సి సురేందర్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. గ్రామీణ జీవన విధానం, ప్రజల ఆలోచనలు ఎలా ఉంటాయన్న దానిపై కో ఆర్డినేటర్స్ తో తన అభిప్రాయాలను పంచుకున్నారు. పల్లెలు పచ్చగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందన్నారు. పల్లె సీమల సమగ్రాభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలను అమలుచేస్తోందన్నారు. అయితే నీటి సంబంధిత వ్యాధులు, అపరిశుభ్ర పరిసరాలతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ చితికిపోతుందన్న ఈఎన్.సి, ఈ పరిస్థితిని మార్చడానికే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు గారు మిషన్ భగీరథను మొదలుపెట్టారన్నారు. ఇంటింటికి రక్షిత మంచినీటిని అందించి ఆడబిడ్డల కష్టాలను దూరం చేయబోతున్నారని చెప్పారు. సురక్షిత తాగునీటితో నీటి సంబంధిత వ్యాధులు తగ్గి గ్రామీణుల ఆదాయం ఆదా అవుతుందన్నారు. ఈ దైవకార్యం కోసం సుమారు 40 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నారని, కేసీఆర్ గారి ఆశయాన్ని ప్రతీ ఒక్కరికి తెలియచేయాల్సిన బాధ్యత సాక్షర భారత్ కో ఆర్డినేటర్స్ పై ఉందన్నారు. ప్రతీ ఒక్కరు ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకుని తాగునీటి వినియోగం, సంరక్షణ, స్వచ్ఛ్ భారత్ పై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. పని చేస్తే కచ్చితంగా గుర్తింపు వస్తుందనడానికి గ్రామీణ తాగునీటి సరాఫరా విభాగమే సాక్ష్యమన్న ఈఎన్.సి, ముఖ్యమంత్రి గారి ప్రోత్సాహం, మార్గదర్శకత్వంలో తమ ఇంజనీర్లు అద్భుత పనితీరు కనబరుస్తున్నారని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో తొలిసారిగా మిషన్ భగీరథలో ఫ్లో కంట్రోల్ వాల్వ్ లను వినియోగిస్తున్నామని, దీంతో గ్రామంలోని ప్రతీ ఒక్కరికి సమానంగా నీళ్లు అందుతాయన్నారు. తెలంగాణ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యం, ముఖ్యమంత్రి గారి మానస పుత్రిక మిషన్ భగీరథలో భాగం కావడాన్ని గర్వంగా భావించాలన్నారు. తెలంగాణ గ్రామీణ తాగునీటి సరాఫరా విభాగం తమ పై ఉంచిన నమ్మకాన్ని తమ పనితీరుతో నిలబెట్టుకుంటామన్నారు సాక్షర భారత్ కో ఆర్డినేటర్లు. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి ముఖ్యమంత్రి గారు తలపెట్టిన పవిత్ర కార్యక్రమం గురించి ప్రజల్లో అవగాహన కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సిపార్డ్ జాయింట్ డైరెక్టర్ నరేంద్రనాథ్, NRDWP కన్సల్టెంట్ నర్సింగరావు, స్వఛ్చ భారత్ మిషన్ డైరెక్టర్ రామ్మోహన్ తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

About The Author

Related posts