
లండన్ : కారు ప్రమాదంలో తల , మొండం వేరైంది. వెన్నూపూసకు , మెదడుకు కలిపే మెడ భాగంలో అన్నీ వేరయ్యాయి. బతకడం కష్టమనుకున్నారు. గుండె కూడా ఆగిపోయింది. కానీ అద్భుతం జరిగింది. గుండెకొట్టుకుంది. అరుదైన ఆపరేషన్ తో మళ్లీ మామూలు మనిషయ్యాడు టోని కోవాన్.
టోనీ కోవాన్ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. మెడకు, వెన్నుపూస వేరైంది. గుండె ఆగిపోయింది. అంబెలెన్స్ వచ్చి స్ట్రోక్ ఇవ్వడంతో ఆగిపోయిన గుండె కొట్టుకుంది. ఆస్పత్రికి తరలిస్తే వెన్నూపూస, మెడ జాయింట్ వేరైందని.. ఇక బతకడన్నారు. కానీ భారతీయ వైద్యుడు చేసిన అరుదైన చికిత్స ఆ వ్యక్తికి ప్రాణం పోసింది. అతడి మెడకు, పుర్రకు ఒక లోహపు పలక, బోల్లులు అమర్చి ఆపరేషన్ విజయవంతం చేశారు. ఇప్పుడు టోని ఇంటికెళ్లేందుకు సిద్దమయ్యాడు.