Breaking News

తల్లిదండ్రులను వదిలేసిన ఉపాధ్యాయులకు శాస్తి

HY09AASRA2_2193658f

రంగారెడ్డి : పిల్లలను ఎంతో కష్టపడి చదివించారు.. ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించిపెట్టారు. తమ పిల్లల్ని టీచర్ ను చేసిన తల్లిదండ్రులు మాత్రం ఆసరా పించన్ల కోసం అలమటిస్తున్నారు. కొడుకులు వదిలేయడంతో దీన స్తితిలో అడుక్కంటున్నారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లాలో వెలుగుచూసింది..

ఆసరా కోసం దరఖాస్తు చేసుకున్న వృద్ధుల తనిఖీలో వారు ఉపాధ్యాయుల తల్లిదండ్రులని గుర్తించారు. దీంతో వారికి పింఛన్ మంజూరు ను నిలిపివేశారు. ఇన్నాళ్లు కట్టిన సొమ్మును రికవరీ చేశారు. అనంతరం అధికారులతో తమ పిల్లలైన ఉపాధ్యాయులు తమను పట్టించుకోవడం లేదని ఆసరా పింఛన్లు ఇవ్వాలని మొరపెట్టుకున్నారు..

దీంతో స్పందించిన రంగారెడ్డ కలెక్టర్ ఉపాధ్యాయుల జీతాల్లోంచి డబ్బులు కట్ చేసి తల్లిదండ్రులకు ఇవ్వాలని జిల్లా విద్యాశాఖాధికారిని ఆదేశించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *