Breaking News

తలసానిని మంత్రి పదవి నుంచి వెంటనే భర్తరఫ్ చేయాలి

తలసానిని మంత్రి పదవి నుంచి వెంటనే భర్తరఫ్ చేయాలి

హైదరాబాద్ :    టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పరచిన మొదటి రోజు నుంచి టీడీపీ, కాంగ్రెస్, బీఎస్సీ తదితర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయించేల ప్రలోభాలకు గురిచేస్తోందని టిడిపి నాయకుడు కెపి వివేకానంద గౌడ్ ఆరోపించారు. ఆదివారం నాడు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రలోభాలకు లొంగకపోతే ప్రభుత్వం నుంచి పనులు జరగవంటూ కేసీఆర్ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారన్నారు.

2014 డిసెంబర్ 16 తేదీన తలసాని శ్రీనివాస్ యాదవ్ తాను రాజీనామా చేశానని, ఎన్నికలకు ఎప్పుడైనా సిద్ధమే  అంటూ ప్రగల్భాలు పలికాడని, కానీ నేడు ఆయన రాజీనామా పెద్ద డ్రామా అని తేలిపోయిందన్నారు. తలసానిపై అనర్హత వేటు విషయంలో మేము స్పీకర్ ను ఇప్పటి దాకా
ఎనిమిది సార్టు కలిశామని, అలాగే రాజ్యాంగాన్ని పరిరక్షించాలని గవర్నర్ కు పలుమార్లు విజ్ఞప్తి చేశామన్నారు. రాజ్యాంగ అధినేత అయిన రాష్ట్ర్రపతిని కూడా కలిసి తగిన చర్య
తీసుకోవాల్సిందిగా విన్నవించామని, టీటీడీపీ శాసనసభ పక్ష నేతలు హైకోర్టును ఆశ్రయించగా స్పీకర్ కార్యాలయం నుంచి ఒక్కోసారి ఒక్కోరకమైన సమాధానం వెలువడిందని,  ఈ విషయంపై కోర్టులు, విస్పష్టంగా ఆదేశాలు జారీ చేసి ఎప్పటిలోగా చర్య తీసుకుంటారో చెప్పండంటూ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించామన్నారు. స్పీకర్ కు రాజీనామా ఇచ్చారో లేదో తలసాని వెంటనే సమాధానం చెప్పాలన్నారు.

ఈ విషయంపై ముఖ్యమంత్రి, స్పీకర్, గవర్నర్ వెంటనే స్పందించాలన్నారు. తెలుగుదేశం పార్టీ టిక్కెట్టుపై గెలిచి టీఆర్ఎస్ లో చేరి రాజీనామా చేయకుండానే చేసినట్టు ప్రజలను, స్పీకర్ ను తప్పు దారి పట్టించిన శ్రీనివాస్ యాదవ్ ను వెంటనే మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసి 420కేసు పెట్టాలని టీడీపీ నాయకురాలు బి.శోభారాణి డిమాండ్ చేశారు. రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిన మంత్రి శ్రీనివాస్ యాదవ్ ను వెంటనే బర్తరఫ్ చేయాలని చట్టపరంగా చర్యలు  తీసుకోవాలని దేశం నేత మాగంటి గోపీనాధ్ డిమాండ్ చేశారు.

 

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *