తలకాయున్నోడెవడైన ప్రభుత్వ పైసలు పెడతడా..

KCR-chandi-yagam2-400x255

సీఎం కేసీఆర్ తాను నిర్వహించే అయుత చండీయాగం పై వస్తున్న విమర్శలపై స్పందించారు. ‘సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి ప్రభుత్వ సొమ్ముతో అయుత చండీయాగం కేసీఆర్ నిర్వహిస్తున్నారని విమర్శించడంపై స్పందించారు.

తాను తన సొంత ఖర్చుతో అయుత చండీయాగం నిర్వహిస్తున్నానని .. తలకాయున్నోడెవడైనా ప్రభుత్వ పైసలు సొంత పనులకు వాడతాడా అని పేర్కొన్నారు. సొంత ఖర్చుతో ట్రాన్స్ ఫార్మర్ కూడా సమకూర్చుకున్నామని.. భోజనాలు, ఇతర కార్యక్రమాలు కొందరు సొంతంగా చేద్దామని ముందుకొచ్చారన్నారు.

ఈ యాగానికి రాష్ట్రపతిని, వివిద రాష్ట్రాల సీఎంలు, గవర్నర్లు, ఏపీ సీఎం చంద్రబాబును సైతం ఆహ్వానిస్తామన్నారు. ఇప్పటికైనా ప్రతిపక్షాల విమర్శలు చేసుకోవాలన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *