
దాదాపు తెరమరుగయ్యాడనుకుంటున్న హీరో తరుణ్ కొత్త చిత్రంతో ముందుకొస్తున్నారు. తరుణ్ హీరోగా రూపొందుతున్న కొత్త చిత్రం ప్రారంభోత్సవం హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సురేష్ బాబు , దాసరి నారాయణ రావు ముఖ్య అతిథులుగా హాజరై చిత్రాన్ని ప్రారంభించారు.