
దక్షిణ భారత నటీనటుల సంఘం (నడిగర్ సంఘం) ఎన్నికలు తమిళ నాట సినీ రంగాన్ని రెండు గా చీల్చాయి.. ఇన్నాళ్లు సంఘంలో గుత్తాధిపత్యం వహిస్తున్న శరత్ కుమార్ బృందానికి మంగళం పాడారు యువ హీరో విశాల్ , నాజర్ ల బృందం.. సంఘానికి కొత్త అధ్యక్షుడిగా ప్రముఖ సీనియర్ నటుడు నాజర్ ఎన్నికయ్యాడు.. ప్రధాన కార్యదర్శిగా తెలుగు వాడు విశఆల్, కోశాధికారిగా కార్తి గెలుపొందాడు.
రజనీ, కమల్ లు కూడా వేరుపడి తీవ్ర ఆరోపణలతో హీటెక్కిన ఈ తమిళ సీనీ సంఘం ఎన్నికలు అక్కడ ఉత్కంఠ రేపాయి.. సినీ రంగంలో రెండు వర్గాలు విడిపోయింది.. తమిళనాడు సీఎం జయలలిత సైతం శరత్ కుమార్ బృందానికి మద్దతు తెలిపింది.. 10ఏళ్లుగా అధ్యక్షుడిగా గుత్తాధిపత్యం వహిస్తున్న శరత్ కుమార్ బృందానికి యువనటుడు తెలుగువాడు విశాల్ చెక్ పెట్టారు. బరిలో నిలిచి ఎన్నికల్లో శరత్ కుమార్ ను చిత్తుగా ఓడించారు.