
ఈ తమిళ నటులకు పైసొలిస్తే చాలా.. ప్రచారం వద్దా.. ఇలాగే ఉంది వారి వైఖరి.. తమిళనటుడు విజయ్ హీరోగా తమిళంలో దాదాపు 100 కోట్ల వ్యయంతో తెరకెక్కిన చిత్రం పులి. ఈ మూవీ తెలుగు తమిళంలో విడుదలవుతోంది. తమిళంలో హీరో తారాగణం అంతా పాల్గొని ఘనంగా ఆడియోను జరుపుకున్నారు. ఇందులో రాణి పాత్ర పోషిస్తున్న శ్రీదేవి సైతం పాల్గొంది.. అయితే
ఇక తెలుగు వెర్షన్ ఆడియో లాంచ్ వేడుక ఎవరూ లేక కళ తప్పింది… కనీసం హీరో విజయ్, హీరోయిన్, శ్రీదేవి ఇలా ఎవరూ రాలేదు.. తెలుగు లో హక్కులు కొన్న నిర్మాత ఏదోలా ఆడియోను లాంచ్ చేసింది.. సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్, దర్శకుడు కొరటాల శివ, నిర్మాత సి.కళ్యాన్ తదితరులు ఆడియోను విడుదల చేశారు..
తమిళ నటులకు ఇక్కడ డబ్బులు కావాలి కానీ ప్రచారం వద్దా అంటున్నారు తెలుగు అభిమానులు..