తమిళనాడు సీఎంగా ‘అమ్మ’ ప్రమాణ స్వీకారం

jaya

చైన్నై : తమిళనాడు సీఎంగా జయలలిత 5వ సారి ప్రమాణ స్వీకారం చేశారు. శనివారం చైన్నైలో జరిగిన  కార్యక్రమంలో జయలలిత చేత గవర్నర్ రోశయ్య ప్రమాణ స్వీకారం చేయించారు. అక్రమాస్తుల కేసులో దోషిగా తేలి 4 ఏళ్లు జైలు శిక్ష పడి అనంతరం హైకోర్టులో నిర్దోషిగా బయటపడింది జయలలిత. దాదాపు ఏడాది పాటు జయలలిత తమిళనాడు సీఎం పదవికి దూరంగా ఉన్నారు. తన అనుచరుడైన పన్నీర్ సెల్వం తమిళ సీఎంగా బాధ్యతలు చేపట్టారు.

తమిళ నాడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడంతో తమిళనాడు అంతా పండుగ వాతావరణం నెలకొంది. చైన్నై మొత్తం అమ్మ ఫ్లెక్సీలతో నిండిపోయింది.

జయలలిత ప్రమాణ స్వీకారం అనంతరం 29 మంది మంత్రులతో గవర్నర్ రోశయ్య ప్రమాణ చేయించారు. ఇందులో మాజీ సీఎం పన్నీర్ సెల్వం కూడా ఉన్నారు.

కాగా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సూపర్ స్టార్ రజనీకాంత్, నటుడు శరత్ కుమార్ హాజరయ్యారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *