Breaking News

తమిళనాడు పై ఫోకస్ చేసిన మోడీ

23-chennai-indiaink-tmagArticle-v2

రాష్టాలు తమ పథకాల ప్రారంభాలకు రమ్మని పిలిచినా రాని నరేంద్రమోడీ తమిళనాడుకు మాత్రం పిలువకుండానే వెళ్లి కోయంబత్తూరులో ఈఎస్ఐ వైద్యకళాశాలను ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం వాటర్ గ్రిడ్, మిషన్ కాకతీయ లాంటి అద్భుత పథకాలను ప్రారంభిద్దురు రండి అని పిలిచినా రాలేదు.. చాలా రాష్ట్రాలు కూడా పిలిచినా వెళ్లని మోడీ సడన్ గా తమిళనాడులో పర్యటించడానికి కారణం ఉంది.. ఎందుకంటే ఈ ఏడాది తమిళనాడులో ఎన్నికలు జరుగనున్నాయి.. అందుకోసం చిన్న కాలేజీ ప్రారంభోత్సవమైనా దానికి హాజరై ప్రచారపర్వానికి తమిళనాడులో శ్రీకారం చుట్టారు..

ఈసారి తమిళనాడులో జయలలిత అంతా చురుగ్గాలేరు.. ఎన్నికలకు ఆమె ప్రాధాన్యత ఇవ్వడం లేదు.. పాలనపై కూడా శ్రద్ధ చూపడం లేదు. అందుకే ఎలాగైనా బీజేపీ తమిళనాడులో పొత్తులతో సీట్లు గెలవాలని యోచిస్తోంది. ఈ రకంగా దక్షిణాదిలో బీజేపీకి పురుడుపోయాలని చూస్తోంది. ఇందులో భాగంగానే తమిళనాట రజనీకాంత్ కు నాయకత్వం అప్పగించాలని మోడీ యోచిస్తున్నారు. కానీ అక్కడ రజనీ ఆసక్తి చూపడం లేదు.. దీంతో చోటా మోటా పార్టీలతోనైనా సరే స్నేహం చేసి తమిళనాట తమ ఉనికి కాపాడుకోవడానికి మోడీ తమిళనాడులో పర్యటించారు. మున్ముందు పార్టీని అక్కడ బలంగా చేయడానికే మోడీ పర్యటన సాగిందనడం లో సందేహం లేదు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *