తమిళనాడులో సజీవ సమాధులవుతున్న 50 మంది..

తమిళనాడులో ఓ 50మంది సజీవ సమాధి అయ్యేందుకు గోతులు తవ్వుకొని రెడీ గా ఉన్నారు. ఇందుకోసం శివగంగై జిల్లా సింగణపురి గ్రామంలోని శ్మశనవాటికలో పదిసెంట్ల భూమిని కొనుగోలు చేశారు. ఇప్పటికే అందులో ముగ్గురు జీవ సమాధి అయ్యారని స్థానికులు చెబుతున్నారు. పాండియన్ అనే విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు కూడా జీవ సమాధి కావడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఆయన గతంలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా ప్రభుత్వం నుంచి అవార్డు తీసుకోవడం గమనార్హం.
స్థానిక శివానంద పరమహంస శిష్యుడు నారాయణ నంబియార్ భోదనలతో ప్రభావితమై వీరంగా సజీవ సమాధి అవుతున్నారని భోగట్టా. అధికారులు సజీవ సమాధి వద్దంటూ గ్రామీణులకు అవగాహన కల్పించేందుకు అధికారులు సిద్ధమయ్యారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *