
తమిళనాడులో ఎగ్జిట్ పోల్స్ అన్నీ అధికార జయలలిత పార్టీ అన్నాడీఎంకే ఓడిపోతుందని సర్వే లో చెప్పాయి.కానీ ఆశ్చర్యకరంగా అసెంబ్లీ ఎన్నికల్లో జయలలిత పార్టీ దూసుకెళ్తోంది. ప్రతిపక్ష డీఎంకే ఓడిపోతోంది..
ఈరోజు ఉదయం వెలువడుతున్న ఫలితాల్లో ఉదయం 10 గంటల వరకు వచ్చిన మెజార్టీని చూస్తే తమిళనాడులో జయలలిత పార్టీ 1 30స్థానాల్లో లీడ్ లో ఉండగా.. ప్రతిపక్ష డీఎంకే 96 స్థానాల్లో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇది ఓ రకంగా జయలలితకు ఊరటనిచ్చేదే.. ఈ ఎన్నికల్లో ఓడిపోతుందని అందరూ భావించగా.. ఆశ్చర్యకరంగా తమిళనాడు ప్రజలు అమ్మ జయలలితకే ఓటేయడం గమనార్హం.