తమిళనాడులో ‘ఆంధ్రా బ్యాంకు’పై బాంబు దాడి

శేషాచలం అడువుల్లో 20 మంది ఎర్రచందనం దొంగల ఎన్ కౌంటర్ తో తమిళనాడులో నిరసన సెగలు కొనసాగుతున్నాయి. తమిళుల ఎన్ కౌంటర్ కు నిరసనగా అక్కడి ప్రజలు, ప్రజాసంఘాలు స్థానిక తెలుగు ప్రజల ఆస్తులు, ఇళ్లపై దాడులకు దిగుతున్నారు. గురువారం తమిళనాడులోని తూత్తుకూడిలో ఆంధ్రా బ్యాంకుపై బాంబు దాడి చేశారు. అలాగే, చైన్నైలోని టీనగర్ ఆంధ్రా క్లబ్ పై కొంతమంది దాడికి ప్రయత్నించారు. ఆంధ్రాప్రాంతానికి చెందిన 10 బస్సులపై దాడులకు దిగారు. అద్దాలు పగుల గొట్టి, బస్సులను ధ్వంసం చేశారు.  కాగా తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వం ఎన్ కౌంటర్ బాధితులకు తలా 3 లక్షల ఆర్థికసాయం చేశారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *