తమిళనాడుకు ముంచుకొస్తోంది..

cyclone-nilam

చైన్నై : తమిళనాడుకు ముంపు ముంచుకొస్తోంది. బంగాళాఖాతంలో చైన్నైకి ఆగ్నేయంగా 350 కి.మీల దూరంలో పుదుచ్చేరికి దగ్గరలో వాయుగుండం ఏర్పడింది. ఇది తీవ్ర తుఫాన్ గా మారింది. ఇప్పటికే దీని ప్రభావం వల్ల చైన్నై, తిరుమల,పుదుచ్చేరి, తమిళనాడులో భారీవర్షం కురుస్తోంది..

కాగా తీవ్ర తుఫాన్ రేపు రాత్రికి పుదుచ్చేరిలో తీరం దాటే అవకాశాలుండడంతో తమిళనాడు ప్రభుత్వం రేపు పాఠశాలలన్నింటికి సెలవు ప్రకటించింది. పిల్లలు, బయట తిరగొద్దని ప్రభుత్వం హెచ్చరించింది. మత్య్స కారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.

తిరుమలలో కురుస్తున్న భారీ వర్షాలకు జనం స్తంభించింది. ఎడతెరపి లేకుండా నిన్నటి ఉదయం నుంచి కురుస్తున్న వర్షాలకు తిరుమల ఘాట్ రోడ్డులో కొండ చరియలు విరిగిపడడంతో ట్రాపిక్ అంతరాయం ఏర్పడింది. అధికారులు కొండచరియలు తొలగిస్తున్నారు. శ్రీవారి మెట్టువద్ద కూడా కొండచరియలు విరిగిపడ్డాయి.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *