Breaking News

తప్పు చేయకుంటే మీడియా పై ఆంక్షలెందుకు?

తప్పు చేయకుంటే మీడియా పై ఆంక్షలెందుకు?

ప్రభుత్వం సరైన దిశగా పయనిస్తూ తప్పు చేయనప్పుడు మీడియాపై ఆంక్షలు ఎందుకని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, పొలిట్ బ్యూరో సభ్యులు మోత్కుపల్లి నరసింహులు అన్నారు. ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యమ సమయంలో మీడియా వల్లనే తెలంగాణ ఏర్పడిందన్న కెసీఆర్ ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే మీడియా తప్పేం చేసిందని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం సక్రమంగా ప్రజలకు సేవ చేసేటప్పుడు మీడియా కూడా వాటికి అనుగుణంగానే సహకరిస్తుందన్నారు. తప్పు చేసినప్పుడు ఎత్తి చూపడంలో ఎలాంటి వెనుకంజ వేయకపోవడంతో ఈ నిషేధాన్ని, ఆజ్ఞలను ఆయన ప్రవేశపెట్టారన్నారు. ప్రజా సమయంలో మీడియా పాత్ర ఎంతోవుందన్నారు. తెలంగాణలో దళితులకు, మహిళలకు క్యాబినేట్ లో చోటు కల్పించలేని ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమేనన్నారు. ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు ఇద్దరు దళితులకు అవకాశాన్ని కల్పించారన్నారు. గతంలో కూడా ఇక్కడ పరిపాలించిన ప్రభుత్వాలు దళితులకు సరైన ప్రాతినిధ్యమే కల్పించారు. తెలంగాణ వస్తే దళిత ముఖ్యమంత్రే అవుతారని మాట తప్పితే తల నరుక్కుంటానని నమ్మబలికి టీఆర్ఎస్ ఓట్లు వేయించుకుందన్నారు. దొరల పాలన ఇక్కడ సాగుతొందని, దళితులకు కేసీఆర్ మోసం చేసినందుకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలన్నారు. దళిత వర్గాన్ని అంటరానివారిగా కెసిఆర్ చూస్తున్నారని తగిన గుణపాఠం దగ్గరలో చెప్పాల్సివుంటుందన్నారు. ఆనాడు నిజాం మీద పోరాటం చేశాం. ఈరోజు కేసీఆర్ కుటుంబం మీద దళితులంతా పోరాటానికి సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. మార్చి 9న దళిత ధూంధాం సభ విజయవంతానికి రాజకీయాలకు అతీతంగా ప్రతి దళితుడు హజరు కావాల్సివుందని ఆయన కోరారు. మెదక్ జిల్లాలో తల్లి పాలను కూడా బిడ్డకు ఇవ్వడానికి అనుమతి ఇవ్వకపోవడంతో బిడ్డ మృతికి కారణమైన కాంట్రాక్టర్ పై చర్య తీసుకోలేని ప్రభుత్వమన్నారు. దళితులకు, వారి పిల్లలకు ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటినుంచి ఎలాంటి సహయ కార్యక్రమాలు చేపట్టలేదన్నారు. కొల్లగొట్టి అమ్ముకోవాలని చూస్తున్న సచివాలయం కేసీఆర్ అబ్బసొత్తా అని ఆయన మండిపడ్డారు. బడుగు, బలహీనవర్గాల కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నారు. సంక్రాంత్రికి వెళ్ళిన ఆంధ్రావాళ్ళను రానీయద్దంటూ గోడలు కట్టించిన కేసీఆర్ జీహెచ్ యంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆంధ్రావాళ్ళు సవాళ్ళంటూ నమ్మబలికే మాటలు మాట్లాడుతున్నారన్నారు. అంబేద్కర్ హక్కుల కోసం దళితులందరూ ఏకతాటిపై కదిలి సభను విజయవంతం చేయాలని ఆయన ఈ సందర్భంగా కోరారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *