
-నా ఫోన్ ట్యాపింగ్ చేశారని విమర్శ -పరోక్షంగా స్టీఫెన్ సన్ తో మాట్లాడినట్టు నిర్ధారణ
మంగళగిరిలో బాబు ఫైర్.. నల్గొండలో కేసీఆర్ నిప్పులు.. రేవంత్ రెడ్డి వ్యవహారంపై ఇద్దరు సీఎంలు మొదటిసారి స్పందించారు. చంద్రబాబు నా ఫోన్లు ట్యాపింగ్ చేస్తావా.. కుట్రలు చేస్తున్నావంటూ కేసీఆర్ మండిపడగా.. నీవు దొంగవు..పట్టపగలు దొరికిన దొంగవు.. నిన్ను ఆ బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడు అని మండిపడ్డారు.
ఇద్దరు చంద్రులు ఏకకాలంలో రేవంత్ ఓటుకు నోటుపై స్పందిచడం రాజకీయంగా హీట్ ను పెంచింది. చంద్రబాబు ఆవేశంగా మంగళగిరిలో నా ఫోన్లు ట్యాప్ చేస్తావా అని ప్రశ్నించి తప్పుచేశారు. ఈ రకంగా తానే స్టీఫెన్ సన్ తో మాట్లాడినట్టు పరోక్ష ఒప్పుకున్నట్టు ఆయన మాటల ద్వారా తేటతెల్లమైంది.దీంతో ఈ ముడుపుల బాగోతంలో చంద్రబాబు హస్తం ఉన్నట్టు రుజువైంది.
కాగా కేసీఆర్ చంద్రబాబును జాతీయ, రాష్ట్రీయ స్థాయిలో దిగ్బంధనం చేస్తున్నారు. ఎలాగైనా చంద్రబాబును అరెస్ట్ చేయించాలనే పట్టుదలతో ఉన్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగింది.