Breaking News

ఢిల్లీ వీధుల్లో సామాన్యుడిలా కేజ్రీవాల్

kezriwal

ఢిల్లీ, ప్రతినిధి : ఆయన ఇప్పుడు సీఎం. భారీ కాన్వాయ్.. పదుల సంఖ్యలో పోలీసులు.. సెక్యూరిటీ హంగామా ఉండాలి.. కానీ అవేవీ ఆయన వెంటలేవు.. సామాన్యుడిలా వీధుల్లో తిరుగుతూనే ఉన్నాడు. పోలీస్ సెక్యూరిటీ పేర లక్షల ప్రజాధనం వృథా చేయవద్దంటూ తన తన సెక్యూరిటీని తానే తగ్గించుకున్నాడు. ఒంటరిగా భార్యతో పొద్దున్నే మార్నింగ్ వాక్ వెళుతూ జనానికి చేరువవుతున్నారు.

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు అధికారం వచ్చినా తాను ఒక సామన్యుడినే అని ప్రజలతో మమేకమవుతున్నారు. ఇటీవల ఢిల్లీకి చెందిన ఓ జవాను చనిపోతే ఆ కుటుంబానికి కోటి రూపాయలు సాయం చేసి జవాను భార్యకు ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇచ్చి ఆదుకున్నారు గొప్ప మనసున్న కేజ్రీవాల్..

మన సీఎంలు చంద్రబాబు, కేసీఆర్ లు ఇలా ప్రజలకు అందుబాటులో ఉంటే చాలంటున్నారు జనాలు.. భారీ కాన్వాయ్.. హంగులు, ఆర్భాటాలు, సెక్యూరిటీ తగ్గిస్తే చాలా డబ్బులు మిగులుతాయి.. కేజ్రీవాల్ స్ఫూర్తితో మన సీఎంలు కొనసాగాలని ఆశిద్దాం…

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *