Breaking News

ఢిల్లీ లో మొదలైన పౌలింగ్

voting_elections

-70 స్థానాల కోసం 676 మంది బరిలో అభ్యర్థులు
-ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు
ఢిల్లీ, ప్రతినిధి : దేశ రాజధాని ఎన్నికల ఓటింగ్ ప్రారంభమైంది. ఢిల్లీలోని మొత్తం 70 స్థానాలకు గాను 676 మంది బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో మొత్తం కోటి ముప్పై లక్షల మంది ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఢిల్లీ సీఎం అభ్యర్థులుగా ఉన్న కిరణ్ బేడీ, కేజ్రీవాల్, అజయ్ మాకెన్ లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఎన్నికల్లో పోటా పోటీ ప్రచారం, వ్యూహాలతో దూసుకుపోయిన పార్టీలకు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. కేజ్రీవాల్, కిరణ్ బేడీల మధ్య అసలు పోటీ ఉండడంతో ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ నెలకొంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *