ఢిల్లీ బీజేపీ సీఎం అభ్యర్థి కిరణ్ బేడి?

-కిరణ్ బేడి చేరికతో మారిన ఢిల్లీ రాజకీయాలు
న్యూఢిల్లీ , ప్రతినిధి : కిరణ్ బేడీ నిన్న అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరడంతో ఢిల్లీ రాజకీయాల ఒక్కసారిగా మారిపోయాయి.. పెరిగిపోతున్న ఆమ్ ఆద్మీ పార్టీ సామర్థ్యాన్ని అమిత్ షా చాలా చాకచాక్యంగా వ్యవహరించి చెక్ పెట్టారు. ఆమ్ ఆద్మీలో ఉన్న కిరణ్ బేడిని ఢిల్లీలో బీజేపీలో చేర్చుకొని ఆ పార్టీకి తిరుగులేని షాక్  ఇచ్చారు. చుక్కాని లేని నావాలా ఉన్న ఢిల్లీ బీజేపీ రాజకీయాలు కిరణ్ బేడి రాకతో కొత్త ఉత్సాహం వచ్చినట్లైంది.

ఢిల్లీ ఎన్నికలకు నగారా మోగడంతో బీజేపీ సీఎం అభ్యర్థిగా కిరణ్ బేడీ ని దాదాపుగా ఖరారు చేశారనే చెప్పొచ్చు. ఆమెను చేర్చుకున్నది కూడా ఆమ్ ఆద్మీ క్రేజీవాల్ కు చెక్ పెట్టేందుకే.. ఈ నేపథ్యంలో ఢిల్లీ పీఠాన్ని దక్కించుకునేందుకు బీజేపీకి చక్కటి అవకాశం లభించినట్లైంది.

కాగా బీజేపీలో చేరిన కిరణ్ బేడీ అనంతరం మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడి నాయకత్వం తనను ప్రభావితం చేసిందని ఆయన నేతృత్వంలో తాను పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నానని  పేర్కొన్నారు. అడ్మినిస్ట్రేషన్‌లో 40 ఏళ్ల అనుభవం ఉందని పనిచేయడం పని చేయించుకోవడం తనకు తెలుసన్న కిరణ్‌బేడీ ఢిల్లీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానన్నారు. కాగా ఢిల్లీ ఎన్నికల్లో ఆమె పోటీ చేయనున్నట్టు బిజెపి చీఫ్‌ అమిత్‌షా స్పష్టం చేశారు. కేజ్రీవాల్‌ను ధీటుగా ఎదుర్కునేందుకు బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్థిగా కిరణ్‌బేడీని రంగంలోకి దింపే అవకాశం కనిపిస్తోంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.