Breaking News

ఢిల్లీ పర్యటనలో రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కె. తారక రామారావు

ఢిల్లీ పర్యటనలో రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కె. తారక రామారావు

*ఢిల్లీ పర్యటనలో  బిజీ బిజీ గా గడిపిన రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కె. తారక రామారావు*

రాష్ట్ర రాజధాని హైదరాబాదు లో డిఫెన్స్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కారిడార్ ను ఏర్పాటు చేయాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను కోరిన రాష్ట్ర మంత్రి కేటీఆర్.

2018 – 19 సంవత్సానికి గాను కేంద్ర బడ్జెట్ లో 2 డిఫెన్స్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కారిడార్ లను ప్రకటించిన కేంద్రం.  ఇందులో ఒకటి హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలని కోరిన మంత్రి.

రక్షణా రంగానికి హైదరాబాదు కు అనుబంధం ఉందన్న మంత్రి కేటీఆర్.  రక్షణ రంగ సంస్థలు, రక్షణ రంగ పరికరాల తయారీలో హైదరాబాద్ ముందు వరుసలో ఉందని వివరించిన మంత్రి. రక్షణ రంగంలో కీలక పాత్ర పోశిస్తున్న హైదరాబాద్ లో ఒక డిఫెన్స్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కారిడార్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్న మంత్రి కేటీఆర్.

ఫిక్కీ ఆధ్వర్యంలో  ఈ నెల 14 -19 వరకు హైటెక్స్ లో జరిగే ఇంటర్ నేషనల్ కాన్ఫరెన్స్ కమ్ ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవానికి రావాలని కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ థోమర్, హర్ష వర్ధన్ లను కొరిన మంత్రి కేటీఆర్.  అనంతరం కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి హర్షవర్ధన్ ను మంత్రి కే.టీ.ఆర్  కలిసి హైదరాబాద్ ఫార్మా సీటికి‌ సహకరించాలని కోరారు.  రాత్రి  కేంద్ర పెట్రోలియం, మైనింగ్ శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో సమావేశమైన మంత్రి కే.టీ. రామారావు. రేపు ఉదయం 10:30 నిమిషాలకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ని రాష్ట్రపతి భవన్ లో మంత్రి కే.టీ. రామారావు సమావేశం కానున్నారు.

ktr 1     ktr 2     ktr 3

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *