ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు

_42526537_students_praying_416

కరీంనగర్ : విద్యార్థుల్లో నైపుణ్యాలను వెలికితీసి వారి సమగ్ర వికాసానికి దోహదపడేలా వస్తున్న విద్యావ్యవస్థలోని సమూల మార్పులపై ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పెద్ద పెండ్యాల, వరంగల్ ఆధ్వర్యంలో కరీంనగర్ లో తల్లిదండ్రులకు ఉచిత అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు ఆ పాఠశాల ప్రిన్సిపాల్ సుబోద్ తప్లియాల్ ఒక ప్రకటనలో తెలిపారు.

ఆధునిక పోటీ ప్రపంచంలో దేనిని అభ్యసించాలి.. రకరకాల పద్దతులతో విద్యార్థులకు మేలు గ్రేడింగ్ లు నిర్ణయించడం ఆట పాటలు వాటితో చదువులు, దెబ్బతింటాయా? వంటి అనే విషయాలపై గల సందేహాలను నివృత్తి చేసుకోవడం ఎలాగో తెలియని పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఉన్నారని తెలిపారు. ఇలాంటి వారి సందేహాలు, సంశయాలను నివృత్తి చేయడంతో పాటు సీబీఎస్ఈ పై సమగ్ర అవగాహన కల్పించేందుకు ఈ ఉచిత అవగాహన సదస్సును ఇక్కడ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. సదస్సులో పాల్గొనాలనే ఆసక్తి గల  తల్లిదండ్రులు ఫోన్ నంబర్లు 9676300611, 967630533లలో 17వ తేదిలోపు సంప్రదించి తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *