
ఏపీ ప్రత్యేక హోదాపై ఢిల్లీ గల్లీలో కడిగిపారేశారు ఏపీ ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి.. ఏపీకి ప్రత్యేక హోదా అంటూ ఓట్లు కొల్లగొట్టి అధికారంలోకి వచ్చిన టీడీపీ, బీజేపీ ఆంధ్రా ప్రజలను దారుణంగా మోసం చేశాయని విమర్శించారు.
విడదీసిన కాంగ్రెస్ కూడా ఇప్పుడు ప్రత్యేక హోదా అంటున్న మొసలి కన్నీరు కారుస్తోందని విమర్శించారు. చంద్రబాబు స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను ఫణంగా పెడుతున్నారని విమర్శించారు. బీజేపీ నేతలకు ఎన్నికలకు ముందో మాట, ఇప్పుడో మాట చెబుతూ కాలం వెళ్లదీస్తున్నాయని విమర్శించారు.
రాహుల్ గాంధీ వైఖరిని కూడా తప్పుపట్టారు జగన్.. అగ్గినేనే అంటు పెట్టాను.. నీళ్లు కూడా నేనే పోస్తాను అనేలా ఉందని విమర్శించారు.
మొత్తానికి ఏపీకి ప్రత్యేక హోదా కోసం తిరుపతిలో కాంగ్రెస్ మొదలు పెట్టిన పోరాటం.. ఒక ప్రాణాన్ని బలితీసుకుంది.. ప్రత్యేక హోదా కోసం పోరాటాన్ని ఢిల్లీ గడప తొక్కేలా చేసింది..