Breaking News

ఢిల్లీ కంటే హైదరాబాద్ సేఫ్

maxresdefault (1)

హైదరాబాద్ : మహిళల రక్షణ విషయంలో ఢిల్లీ కంటే హైదరాబాద్ సేఫ్ సిటీ అని ఎంపీ కవిత అన్నారు. షీ టీంలు ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా సైబరాబాద్ సీపీ సీవీ ఆనంద్ మహిళలతో ర్యాలీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నటి జయసుధ, ఎంపీ కవిత హాజరై మాట్లాడారు.

ఢిల్లీలో మహిళలపై దాడులు జరుగుతున్నాయని.. అక్కడం పోలీస్ లు కంట్రోల్ చేయలేకపోతున్నారని.. కానీ తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ లో మహిళల కోసం షీ టీంలు ఏర్పాటు చేసి రక్షణ కల్పిస్తోందన్నారు.

సీఎం కేసీఆర్ తెలంగాణ ఏర్పడగానే పోలీసు వ్యవస్థను ఆధునీకరించారని.. మీకేం కావాలో అడిగితే పెద్ద లిస్ట్ ఇచ్చామని. దాన్ని అమలు చేసి మహిళల రక్షణకు తోడ్పాటు నందించారని కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *