Breaking News

ఢిల్లీలో వేడిక్కిన రాజకీయం

collage-modi-kejriwal-sonia-2-1024x630

ఢిల్లీ, ప్రతినిధి : ఢిల్లీలో పొలిటికల్ హీట్ రాజుకుంటోంది. ఓ వైపు చలి చంపేస్తుంటే రాజకీయ నాయకుల మాటల తూటాలతో వేడి రాజుకుంటోంద. ఎన్నికలకు ఇంకా కొద్ది రోజులే సమయం ఉండడంతో పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. ఓటర్లను ఆకర్షించేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. బీజేపీ తరఫున ప్రధానితో సహా కేంద్ర మంత్రులు.. ఎంపీలు ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారు. కేంద్రంలో , రాష్ట్రంలో ఒకటే అధికారంలో ఉంటే ఢిల్లీ అభివృద్ది చెందుతుందని బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల అనంతరం ప్రతీ రాష్ట్రంలో గెలిచిన బీజేపీకి ఢిల్లీలో మాత్రం ఆప్ వంటి బలమైన ప్రత్యర్థి ఉండడం.. దేశ రాజధాని కావడంతో బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎలాగైనా హస్తిన అసెంబ్లీని దక్కించుకునేందుకు పావులు కదుపుతోంది..

ఇక ఆమ్ ఆద్మీ పార్టీ నేత కేజ్రీవాల్ ప్రత్యర్థులకు అందనంత స్పీడ్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. వినూత్న ప్రచార శైలితో ఢిల్లీ చుట్టేస్తూ బీజేపీ నేతలను కలవరపెడుతున్నారు. ఇక కాంగ్రెస్ తరఫున సోనియా రాహుల్, మాజీ కేంద్ర మంత్రులు ప్రచారంలో దూసుకుపోతున్నారు.

కాగా సీఎన్ఎన్ ఐబీఎన్ నీల్సన్ సర్వేలో కేజ్రీవాల్ ముందున్నారు. ఆయనకు ఢిల్లీ ఓటర్లు 49 శాతం ఓట్లు వస్తాయని చెప్పగా.. 44 శాతంతో కిరణ్ బేడీ ద్వితీయ స్థానంలో ఉన్నారు. కేవలం 4 శాతం ఓట్ల తేడా ఉండడంతో గెలుపుపై ఉత్కంఠ నెలకొంది. కొద్దికొద్దిగా కేజ్రీవాల్ వైపే ఓటర్లు మెగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది. దీంతో బీజేపీలో కంగారు మొదలైంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ తరఫున ప్రధాని స్వయంగా రంగంలోకి దిగి ప్రచార పర్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు.రానున్న ఎన్నికల్లో ఎవరి భవితవ్యం ఏంటో తేలనుంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *