ఢిల్లీలో రోజుకి 20 మంది పిల్లలు అదృశ్యం…

ఒక కోటి జనాభా ఉన్న దేశ రాజధాని ఢిల్లీలో ప్రతి గంటకు సరాసరి ఒక అబ్బాయి, లేదా అమ్మాయి అదృశ్యం అవుతున్నారు. అక్షరాల హొం శాఖ అధికారులు వెల్లడించిన నివేదిక ఇది . హొం శాఖ అధికారుల నివేదిక ప్రకారం ప్రతి రోజు సరాసరి 29 నుండి 24 మంది పిల్లలు ఢిల్లీలో కిడ్నాప్ అవుతున్నారు. వారిలో 50 శాతం మందినే అధికారులు పట్టకొగలుగుతున్నారు. హొం శాఖ అధికారులు ఈ నివేదిక వెళ్లడించిన తరువాత పిల్లల కుటుంబ సభ్యులు హడలిపోతున్నారు. కొందరు పిల్లలు కిడ్నాప్ అవుతున్నారని , మరి కొందరిని కిడ్నాప్ చేసి ఇతర నగరాలకు , విదేశాలకు తరలిస్తున్నారని వెలుగు చూసింది ఢిల్లీలో కిడ్నాప్ ముఠాలు పిల్లలను కిడ్నాప్ చేసి నగదు డిమాండ్ చేసే చిల్లర గ్యాంగ్ లు కొన్ని ఉన్నాయి. పిల్లలను కిడ్నాప్ చేసి గుట్టు చప్పుడు కాకుండా  బాలలను విదేశాలకు , అమ్మాయిలను వేశ్యా గృహాలకు తరలిస్తున్న గ్యాంగ్ లు ఉన్నాయి. ఈ ముఠాలను పట్టుకొవడానికి పోలీసులు శక్తి వంచన లేకుండ కృషి చేస్తున్నారు. అయితే పోలీసు సిబ్బంది కొరత వలన అనేక కేసులు మూలన పడుతున్నాయి. కుటుంబ సభ్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం , పాఠశాలలో ఒత్తిడి ఎక్కువ కావడం , చెడు అలవాట్లకు బానిసలు అయి ఇల్లు విడిచి పోవడం లాంటి కారణాలతో ఎక్కువగా కేసులు  నమోదు అవుతున్నాయని, ఈ విషయంపై ప్రభుత్వ పెద్దలు  ద్రుష్టి సారించాకుంటే భవిష్యత్లో మంరింత క్లిష్ట పరిస్తితులు ఎదురవుతాయని కొందరు ఢిల్లీ పోలీస్ అధికారులు అంటున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *