
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో కేసీఆర్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న శాంతి భద్రతల పరిస్థితి గురించి ఆయన హోంశాఖ మంత్రితో చర్చించారు. అనంతరం కేంద్ర మంత్రులు సృతి ఇరానీ, జవదేకర్ లతో కూడా సీఎం భేటి కానున్నారు. కాగా, నిన్న ప్రధాని నరేంద్ర మోడీతో కేసీఆర్ సమావేశమైన సంగతి తెలిసిందే