Breaking News

ఢిల్లీలో కేజ్రీకే మొగ్గు

kejriwal1_02

-సర్వేలో తేల్చిన ఢిల్లీ ఓటర్లు
ఢిల్లీ, ప్రతినిధి : ఢిల్లీలో ఈసారి అధికార బీజేపీకి భంగపాటు తప్పేలా లేదు.. జాతీయ పత్రికలు, చానళ్లు నిర్వహించిన లేటెస్ట్ సర్వేలో కేజ్రీవాల్ కే ఢిల్లీ ఓటర్లు మొగ్గుచూపారు. దీంతో కమలనాథుల్లో కలకలం మొదలైంది. ఢిల్లీ మోడీ నాయకత్వంలో అధికారం చేపట్టినప్పటి నుంచి అన్ని రాష్ట్రాల్లో దూసుకెళ్తున్న బీజేపీకి ఢిల్లీ పరిణామాలు మింగుడు పడడం లేదు. కేజ్రీవాల్ ఎలాగైనా ఓడగొట్టాలన్న బీజేపీ నేతల వ్యూహాలను కేజ్రీవాల్ చిత్తు చేస్తునే ఉన్నారు. కేజ్రీవాల్ ను దెబ్బగొట్టడానికి కిరణ్ బేడీని బీజేపీ రంగంలోకి దించిన ఫలితం కనబడడం లేదు. ఆమెను కేజ్రీవాల్ టార్గెట్ చేసి ప్రచారంలో వినూత్న పోకడలతో ఆమె అధికారం కోసమే బీజేపీలో చేరారని దుయ్యబడుతున్నారు.

దీంతో రానున్న ఎన్నికల్లో బీజేపీ ఆప్ ల మధ్యే ప్రధాన పోరు ఉండనుంది. ఎటూ చూసినా ఈసారి ఢిల్లీ గద్దె ఆప్ వశమయ్యేలా ఉంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *