ఢిల్లీలో ఎన్. సి.ఈ. ఆర్.టి 55వ కౌన్సిల్ సమావేశానికి హాజరైన మంత్రి కడియం శ్రీహరి

ఢిల్లీలో బుధవారం జరిగిన ఎన్. సి.ఈ. ఆర్.టి 55వ కౌన్సిల్ సమావేశానికి హాజరైన ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి.

దేశ వ్యాప్తంగా ఉపాధ్యాయ శిక్షణపై అధ్యయనానికి కమిటీ ఏర్పాటు చైర్మన్ గా కడియం శ్రీహరిని నియమించిన కేంద్ర మంత్రి ప్రకాశ్ జవడేకర్.

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి కామెంట్స్..

రాష్ట్ర ప్రభుత్వం తరపున విద్యా శాఖ లో చేపడుతున్న పథకాలు, నూతన కార్యక్రమాలు, కేంద్రానికి పంపిన రాష్ట్ర ప్రతిపాదనలు వివరించాను.

బాలికా విద్యపై సూచనలను MHRD కి అందజేశాను.

కస్తుర్బా గాంధి బాలికల విద్యాలయాలను 12 తరగతి వరకు పొడిగించినందుకు కేంద్రానికి ధన్యవాదాలు.

కేజీబీవీలను 12 వ తరగతి వరకు పొడగించటం వల్ల బాల్య వివాహాలను అరికట్టి, బాలికల విద్య పెంపొందించేందుకు ఇది దోహదపడుతుంది.

ఎన్ సిఈఆర్ టికి తెలంగాణ తరపున అనేక సూచనలు చేశాం. దేశవ్యాప్తంగా ప్రీ ప్రైమరీ స్కూల్స్ ప్రారంభించాలని కేంద్రాన్ని కోరాం. తెలంగాణాలో 12 వేల అంగన్ వాడీ కేంద్రాలలో స్కూల్స్ నిర్వహిస్తున్నాం.

మధ్యాహ్న భోజన పథకం, స్కూల్ యూనిఫామ్స్ 12 వ తరగతి వరకు అందించేలా సహకారం ఇవ్వాలని కోరాం.

సర్వశిక్షా అభియాన్, ఆర్.ఎమ్‌.ఎస్,ఎ టీచర్ ట్రైనింగ్ అన్ని కలిపి సమగ్ర శిక్షా అభియాన్  పధకం ఏర్పాటు చేస్తున్నామని కేంద్రానికి తెలిపాం.

విద్యారంగానికి 20 శాతం బడ్జెట్ పెరిగింది వచ్చే సంవత్సరం 20 శాతం నిధులు పెంచుతామని కేంద్రమంత్రి తెలిపారు.

తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలలో డైట్  (డిస్ట్రక్ట్ ఇన్స్టిట్యూషన్ ఆప్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్)సెంటర్లను ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రిని
కోరాను.

కొత్త జిల్లాలలో జవహర్ నవోదయ స్కూల్స్ ఏర్పాటు చేయాలని కోరాను.

బాలికా విద్యపై ఇచ్చిన సూచనలలో ఒక సూచనకు మాత్రమే కేంద్రం అంగీకరించింది.

బాలికా విద్య పెంపు కోసం ఇంకా చేయవలసింది చాలా ఉంది..

తెలంగాణలో ఆధార్ ద్వారా స్టూడెంట్ ట్రాకింగ్ విధానం చేపట్టాం.

తెలంగాణలో విద్యావ్యవస్థను పటిష్టం చేసేందుకు అనేక చర్యలు చేపడుతున్నామని, వాటిని కేంద్రమంత్రికి మరోసారి వివరించినట్లు చెప్పారు.

kadiyam srihari 1

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *