ఢిల్లీకి 300మంది ఒబామా సెక్యూరిటీ!

ఢిల్లీ, ప్రతినిధి : ఒబామా పర్యటనలో టైట్ సెక్యూరిటీ సర్వం సిద్ధం అవుతోంది. ఒబామా ఈ నెల 25 న ఇండియాకు రానున్నారు. ఢిల్లీలో జరిగే రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ సెలబ్రేషన్స్ లో పార్టిసిపేట్ చేయనున్నారు. దీంతో సెక్యూరిటీ ఏర్పాట్ల కోసం అడ్వాన్స్ సెక్యూరిటీ యూఎస్ నుంచి ఢిల్లీకి ఈ నెల 13న రానుంది. సెక్యూరిటీ అరేంజ్ మెంట్స్ ను చూడటంతో పాటు పరేడ్ దగ్గర ఒబామాకు కావాల్సిన ఏర్పాట్లను చెక్ చేయనున్నారు. ఢిల్లీలోని ఐటీసీ మౌర్య హోటల్ లో ఒబామా స్టే చేయనున్నారు. వాల్డ్ లోనే పొల్యూషన్ సిటీల్లో ఢిల్లీ టాప్ లో ఉండటంతో ఒబామా బుల్లెట్ ఫ్రూఫ్ రూముల్లోనే ఉండాలని డిసైడ్ అయినట్లు సమాచారం. అడ్వాన్స్ సెక్యూరిటీ కింద 3 వందల మంది యూఎస్ సెక్యూరిటీ ఢిల్లీకి రానున్నారు. ముందుగా ఓ ముప్పై మంది వస్తారని .. ఆ తర్వాత ఒబామా వచ్చే లోగా మిగతా 270 మంది వస్తారని అధికారులు చెప్పారు. రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ లో భాగంగా రాజ్ పథ్ దగ్గర ఈ నెల 23 నుంచి ఒబామా వెళ్లే వరకూ ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. సీసీ కెమెరాలతో ఢిల్లీ సిటీని చెక్ చేస్తున్నట్లు చెప్పారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.