ఢిల్లీకి చోటారాజన్

ఢిల్లీ : మాఫియా డాన్ చోటా రాజన్ ను ఢిల్లీకి తీసుకొచ్చారు భారత సీబీఐ. ఇండోనేషియాలో బాలి నుంచి ప్రత్యేక విమానంలో శుక్రవారం తెల్లవారుజామున తరలించారు. భారత వైమానిక దళానికి చెందిన గల్ఫ్ స్ట్రామ్-3 విమానంలో అతన్ని తీసుకొచ్చారు.ప్రాథమిక విచారణ నిమిత్తం చోటా రాజన్ ను పాలం విమానాశ్రయం నుంచి నేరుగా సీబీఐ ప్రధాన కార్యాలయానికి తీసుకెళ్లారు.

కాగా మహారాష్ట్ర ప్రభుత్వం 70 కేసులను సీబీఐ కి అప్పగించింది. కాగా సీబీఐ అధికారులు మీడియాను తప్పుదోవ పట్టించారు. ఓ ఖాళీ వాహనశ్రేణిలో చోటారాజన్ ను తరలిస్తున్నట్టు నమ్మించి అక్కడి నుంచి తప్పించారు. అనంతరం మరో వాహన శ్రేణిలో చోటారాజన్ ను అక్కడి నుంచి సీబీఐ కార్యాలయానికి తరలించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *