డ‌యాగ్నోస్టిక్స్ కేంద్రాల ప‌నులకు ప్ర‌ణాళిక‌లు సిద్ధం: మంత్రి డాక్ట‌ర్ సి ల‌క్ష్మారెడ్డి

డ‌యాగ్నోస్టిక్స్ కేంద్రాల ప‌నులు వేగ‌వంతం ప్ర‌ణాళిక‌లు సిద్ధం: మంత్రి డాక్ట‌ర్ సి ల‌క్ష్మారెడ్డి

డ‌యాగ్నోస్టిక్స్ కేంద్రాల ప‌నులు వేగ‌వంతం

ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేయాలి

స‌మీక్షించిన వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి డాక్ట‌ర్ సి ల‌క్ష్మారెడ్డి

హైద‌రాబాద్:  ప్ర‌జారోగ్య‌మే ప్ర‌ధాన ధ్యేయంగా ప్ర‌భుత్వ‌మే ప్ర‌జ‌లకు అన్ని ర‌కాల వ్యాధి నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేయించే ప‌థ‌కం ప్రారంభానికి అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు వేగంగా తీసుకోవాల‌ని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్ట‌ర్ సి ల‌క్ష్మారెడ్డి సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు. ఇంటింటికీ వైద్య ప‌రీక్ష‌లు అందే విధంగా అవ‌స‌ర‌మైన క‌ర్యాచర‌ణ చేప‌ట్టాల‌న్నారు. ప్ర‌జ‌ల నుంచి ఆరోగ్య స‌మాచారాన్ని రాబ‌ట్టి వాళ్ళ‌కి అవ‌స‌ర‌మైన చికిత్స‌లు, శ‌స్త్ర చికిత్స‌లు జ‌రిగే విధంగా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు.  ఐపీఎంలో ఈ రోజు వ్యాధి నిర్ధార‌ణ ప‌రీక్ష‌ల మీద సంబంధిత అధికారుల‌తో స‌మీక్షించారు.  ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ, సీఎం కెసిఆర్ ప్ర‌జారోగ్య‌మే ప‌ర‌మావ‌ధిగా భావిస్తున్నార‌ని, ప్ర‌జ‌ల‌నేక మంది త‌మ‌కు వ‌స్తున్న వ్యాధులు, వాటి నివార‌ణ ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండ‌టం లేద‌ని, అందువ‌ల్లే వ్యాధులు ముదిరాక అనేక ఇబ్బందులు ప‌డుతున్నార‌ని చెప్పార‌న్నారు. అస‌లు ప్ర‌జ‌ల‌కు ఏయే వ్యాధులున్నాయి?  వాటిని ప్రాథ‌మిక స్థాయిలోనే గుర్తించి, న‌యం చేసే వీలుగా వ్యాధి నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు జ‌ర‌పాల‌న్నారు. ఇందుకు అవ‌స‌ర‌మైన మాన‌వ వ‌న‌రులు, శిక్ష‌ణ‌, ప‌రిక‌రాలు, వైద్య‌శాల‌ల ఆధునీక‌ర‌ణ అవ‌స‌ర‌మైన ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేయాల‌ని ఆదేశించారు.  అంత‌కుముందు మంత్రి ఐపీఎం ఆవ‌ర‌ణ‌లో ఏర్పాటు చేసిన వ్యాధి నిర్ధార‌ణ ప‌రీక్షా కేంద్రాన్ని ప‌రిశీలించారు. త‌న ర‌క్త న‌మూనాల‌ను ప‌రీక్ష‌ల నిమిత్తం ఇచ్చారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రితోపాటు కుటుంబ సంక్షేమ‌శాఖ క‌మిష‌న‌ర్ వాకాటి క‌రుణ‌, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *