డ్రంక్ డ్రైవ్ లో దొరికిపోయిన హీరో మేనకోడలు

హైదరాబాద్, ప్రతినిధి : హైదరాబాద్ లో నిర్వహిస్తున్న డ్రంక్ అండ్ డ్రైవ్ లో సెలబ్రెటీ ల పుత్ర రత్నాలు భారీగా దొరికిపోతున్నారు.   ప్రధానంగా బంజారా‌హిల్స్, జూబ్లీహిల్స్, హైటెక్ సిటీ వంటి ప్రధాన ప్రాంతాల్లో కొందరు బడా బాబుల పిల్లలు మందు కొట్టి ప్రధాన రోడ్లపై బైక్‌ రేస్‌లు, విన్యాసాలతో పాదచారుల్ని ప్రమాదాలపాలు చేస్తూ యమపురి‌కి పంపిన ఉదంతాలెన్నో ఉన్నాయి. నైట్ అన్ లిమిటెడ్ పార్టీల్లో మునిగి, డ్రైవ్ చేస్తూ కొందరు సెలబ్రిటీలు కూడా పట్టుబడిన సంఘటనలు మరెన్నోవున్నాయి.

తాజాగా అక్కినేని నాగార్జున మేనకోడలు అనుమోలు సాహిత్య డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పోలీసులకు దొరికిపోయింది. లిమిట్ దాటి మద్యం సేవించినట్టు ట్రాఫిక్ పోలీసులు తెలియజేశారు. బ్రీత్ ఎనలైజర్ పరీక్షలో ఆల్కహాల్ కంటెంట్ ఆమె అధికంగా తీసుకోవడంతో కేసు బుక్ చేశామని తెలిపారు. ఆ కారు అక్కినేని నాగేశ్వరరావు పేరున రిజిస్టర్ అయ్యిందని, దాన్ని సీజ్ చేశామని వెల్లడించారు. మంగళవారం ఆమె కోర్టుకు హాజరుకావాల్సివుంది. అనుమోలు నాగ సుశీల కుమార్తె. నాగార్జునకు నాగ సుశీల స్వయానా అక్క. ఆమె కొడుకు సుశాంత్ హీరోగా సినిమాలు చేస్తున్నాడు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.