డ్రంక్ & డ్రైవ్ నుంచి తప్పించుకున్నాడిలా.?

మందు కొట్టడం కామనే.. కానీ మందు కొట్టి డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరకకుండా కూడా నేర్చేశారు మన మందుబాబులు.. ఎందుకంటే పండుగలు, పబ్బాలు, బర్తేడేలు, మనసు బాగున్నా.. బాగాలేకున్నా.. సాయంత్రం బోరు కొట్టినా.. బోరు కొట్టకున్నా.. తరచుగా తాగడం మాత్రం కామన్ గా చేస్తున్నారు నేటి యువత, పెద్ద మనుషులు.. నీళ్లు తాగినంత సింపుల్ గా మందు తాగేస్తున్నారు. మరి ఈ అలవాటుతో రోడ్డెక్కి ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకే ఈ మధ్య హైదరాబాద్ లో మొదలైన డ్రంక్ అండ్ డ్రైవ్ లు జిల్లాలు, పట్టణాలకు విస్తరించాయి. పోలీసులు మిషన్లు పట్టుకొని వాహనాలపై వచ్చే మందు బాబులను చెక్ చేస్తూ ఫైన్ లు వేస్తూ .. వాహనాలను సీజ్ చేస్తున్నారు. కాగా ఇదిలా ఉంచితే..

ఇటీవల ఓ పార్టీలో ఫుల్లు తాగేశాడు ఓ మద్యం ప్రియుడు.. ఎంచక్కా తన ద్విచక్రవాహనం తీసుకొని బయలుదేరాడు. కొద్ది దూరం వెళ్లగానే పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నారు. దగ్గరికి వెళ్లాక మనోడి ఓ ఐడియా తళక్కున మెరిసింది. ఇంకేముంది దాన్ని అమలు చేశాడు.

ఫుల్లుగా మందులో ఉన్న ఆ మందు బాబు ఎంచక్కా వాహనం దిగి దాన్ని తోసుకుంటూ పోలీసుల వద్దకు వచ్చాడు. పోలీసులు ఎందుకలా తోసుకుంటూ పోతున్నావని ప్రశ్నించారు. దానికి ఆ మందు బాబు ఇచ్చిన సమాధానం ‘‘సార్.. ఓ పార్టీలో నా ఫ్రెండ్స్ ఫుల్లుగా తాగించారు. అది దిగడానికి ఇలా బండిని తోసుకుంటూ పోతున్నానన్నారు’’. వాహనం నడుపుకుంటూ పోతే డ్రంక్ డ్రైవ్ నిర్వహించడం.. ఫైన్ వేసే పోలీసులకు ఆ మందు బాబు సమాధానంతో బిత్తరపోయారు. వీడు మన మస్కా కొడుతున్నాడని అర్థమైన ఆ పోలీసు బాస్ కు మరో ఐడియా తట్టింది.

మందుబాబు తోసుకుంటూ ఎక్కడి దాకే వెళితే అక్కడి దాకా వెళ్లండని.. వాహనం ఎక్కితే తన దగ్గరకు తీసుకురమ్మని ఇద్దరు కానిస్టేబుళ్లను మందుబాబు వెంట పంపించారు. ఇంకేముందు 3 కి.మీల వరకూ బండి తోసుకుంటూ పోయిన మందుబాబు చివరకు పోలీసులను ఇకే తోయలేను తప్పైంది బాబూ అంటూ శరణు కోరాడు. పోలీసులతోనేనా గేమ్స్..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *