డ్రంక్ అండ్ డ్రైవ్ సెలబ్రెటీలకేనా..?

Drink-driving-Cases

-జిల్లా రహదారులపై పట్టించుకోని పోలీసులు -వేల మంది మృతి చెందుతున్న పట్టని వైనం

హైదరాబాద్ : హైదరాబాద్ పోలీసులు ఒకవైపు చూస్తున్నారు.. మరో వైపు కన్నెత్తి చూడడంలేదు.. ఎందుకంటే వారికి కావాల్సింది పబ్లిసిటీ… అందుకోసమే సెలబ్రెటీలు ఉండే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లోనే ఎక్కువగా డ్రంక్ అండ్ డ్రైవ్ లు నిర్వహిస్తూ పబ్బం గడుపుతున్నారు. ఇక ప్రమాదాలు జరిగే నేషనల్ హైవేలు, జిల్లా రహదారులు, ముఖ్యంగా హైదరాబాద్ కరీంనగర్ రాజీవ్ రహదారిపై డ్రంక్ అండ్ డ్రైవ్ అన్న ముచ్చటే ఉండదు.. ఎందుకంటే ఆ దారులన్నీ సామన్యులు పోయేటివి కదా.. అక్కడేం దొరుకుతుంది..

హైదరాబాద్ లో తాగి తూలుతున్న సంపన్నులను పట్టుకుంటే డబ్బుకు డబ్బు.. పబ్లిసిటీకి పబ్లిసిటీ.. ఇప్పుడు ఇదే పోలీసుల తీరు విమర్శలకు కారణమవుతోంది.. ప్రమాదాలు ఎక్కువగా జరిగే రాష్ట్రాల రహదారులపై కనీసం ఒక్క డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా నిర్వహించడం లేదు. దీంతో మందుబాబులు ఫుల్లుగా తాగి ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్నారు.
కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, విజయవాడ రహదారుల్లో సైతం పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తే చాలా మంది ప్రాణాలను కాపాడినవారవుతారు..  లేకపోతే శరమాములుగా హైదరాబాద్ సంపన్నులు తిరిగే రోడ్లపై సినిమా చూపించినట్టు డ్రంక్ డ్రవ్ నిర్వహిస్తే ఫలితం ఉండదు.. ఇప్పటికైనా పోలీసులు అన్ని చోట్ల డ్రంక్ డ్రైవ్ నిర్వహించాని   కోరుతున్నారు ప్రయాణికులు

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *