
హైదరాబాద్ : రేవంత్ రెడ్డి వ్యవహారంలో అసలు సూత్రధారిగా భావిస్తున్న ఏపీ సీఎంకు స్టీఫెన్ సన్ మాట్లాడిన టేపులను తెలంగాణ ప్రభుత్వం రిలీజ్ చేయడంతో ఇరకాటంలో పడినట్టైంది. దీంతో రాబోయే పరిణామాలపై ఆయన ఏపీ డీజీపీ, ఉన్నతాధికారులతో అర్థరాత్రి అత్యవసరంగా సమావేశమయ్యారు. ఆ టేపులు ఎక్కడివని ఆరాతీశారు. కావాలనే తన ఇమేజ్ డ్యామేజ్ చేయడం కోసం తెలంగాణ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని అభిప్రాయపడ్డారట.. దీనిపై పరకాల మీడియాతో మాట్లడుతూ అదే చెప్పారు.
కాగా రేవంత్ వ్యవహారంలో చంద్రబాబు హస్తం ఉందని బహిర్గతం కావడంతో మున్ముందు పరిణామాలపై ఆసక్తి నెలకొంది. ఒక వేళ చంద్రబాబు కు అరెస్ట్ వారెంట్ వెళితే ఆయన సీఎం పదవి కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు వేడెక్కాయి.