డెస్క్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు

హైదరాబాద్ : డెస్క్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలంగాణ ఐ అండ్ పీఆర్ కమిషనర్ నవీన్ మిట్టల్ తెలిపారు. సిబ్బంది కొరత వల్లే వీటి జారీ ఆలస్యమవుతోందన్నారు. టీయూడబ్ల్యూజే నేతలు గురువారం సమాచార శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ తో కాసేపు భేటి అయ్యారు. డెస్క్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ల సంఖ్యలో పరిమితి విఢించడం పట్ల సంఘం నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. డెస్క్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు ఇచ్చేందుకు వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని కమిషనర్ కు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించడానికి సుముఖంగా ఉన్న అధికారులు సహకరించడం లేదనే అభిప్రాయన్ని వ్యక్తం చేశారు.
మార్చి చివరి వారంలోగా జర్నలిస్టుల హెల్త్ కార్డులతో సహా అన్ని సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కమిషనర్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. జిల్లాల నుంచి సిబ్బందిని రప్పించి పని పూర్తి చేయనున్నట్లు కమిషనర్ వివరించారు. ఈ భేటీలో ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి క్రాంతి, ఉపాధ్యక్షులు పల్లె రవి, తెమ్జూ అధ్యక్షులు రమణ, మహేశ్, యోగానంద్ తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *