
-డీపీఆర్వో కు డెస్క్ జర్నలిస్టుల ఫోరం వినతి
కరీంనగర్ : పత్రికల్లో వార్తల ప్రచురణలో కీలకపాత్ర పోషించే డెస్క్ జర్నలిస్టుల(సబ్ ఎడిటర్లు)కు అక్రిడిటేషన్ కార్డులు జారీ చేసి ప్రభుత్వ గుర్తింపు ఇవ్వాలని కోరుతూ డెస్క్ జర్నలిస్టుల ఫోరం జిల్లా శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్ డీపీఆర్వోకు వినతిపత్రం సమర్పించారు. నిత్యం రిపోర్టర్ల వార్తలు తీర్చిదిద్ది ప్రజలకు చేరేవేసేదీ సబ్ ఎడిటర్లేనన్నారు.
డెస్క్ జర్నలిస్టులకు జరుగుతున్న వివక్షను నిరాదరణకు ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించి అక్రిడిటేషన్లు, బస్ పాసులు, హెల్త్ కార్డులు జారీ చేయాలని కోరారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న 100మంది డెస్క్ జర్నలిస్టులందరికీ వెంటనే అక్రిడిటేషన్లు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.. ఈ కార్యక్రమంలో డెస్క్ ఫోరం సభ్యులు సురేశ్, మల్లేషం, సంపత్, శ్రీకాంత్, అజయ్, కిరణ్, సుభాష్, సంబు శ్రీనివాస్, కే.రమేశ్, కన్న రమేశ్, ఆంధ్రజ్యోతి, సాక్షి, నమస్తే సబ్ ఎడిటర్లు తదితరులు పాల్గొన్నారు.