డెస్క్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు, ఆరోగ్య బీమా

హైదరాబాద్ : తెలంగాణలోని వర్కింగ్ జర్నలిస్టులందరికీ (డెస్క్ జర్నలిస్టులతో సహా ) అక్రిడిటేషన్లు, ఆరోగ్య బీమా వర్తింప చేయాలని ప్రభుత్వాన్ని కోరనున్నట్టు ఐజేయూ సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్ పేర్కొన్నారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర యూనియన్ విస్తృత స్థాయి సమావేశం సోమవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో రాష్ట్ర అధ్యక్షుడు నగునూరి శేఖర్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గం, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అమర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ జర్నలిస్టుల కు ఇచ్చిన హామీ మేరకు మీడియా సంస్థల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి అక్రిడేషన్లతో పాటు ఆరోగ్య బీమా (హెల్త్ కార్డులు) పథకాన్ని వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. వర్కింగ్ జర్నలిస్టుల కోసం పోరాడింది తమ సంఘమేనని.. కొందరు కావాలనే బురద జల్లుతున్నారన్నారు. హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని జిల్లాల్లో జర్నలిస్టులకు పంపిణీ చేసిన ఇంటిస్థలాల్లో అత్యధిక శాతం డెస్క్ జర్నలిస్టులకు లభించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మండల విలేకరులకు కూడా తమ సంఘమే అక్రిడిటేషన్లు ఇప్పించిందని గుర్తు చేశారు. డెస్క్ జర్నలిస్టులతో సహా అందిరికీ అక్రిడిటేషన్లు, హెల్త్ కార్డులు ఇవ్వాలని యూనియన్ సమావేశంలో తీర్మానించారు.

tuwjwww

ఈ కార్యక్రమంలో ఐజేయూ మాజీ సెక్రెటరీ జనరల్ కే.శ్రీనివాస రెడ్డి, ప్రెస్ కౌన్సిల్ సభ్యుడు అమర్ నాథ్, యూనియన్ ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ, ఐజేయూ కార్యవర్గ సభ్యుడు సత్యనారాయణ, ఆలపాటి సురేష్ కుమార్, సీనియర్ నాయకులు నరేందర్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కరుణాకర్, కోశాధికారి మహిపాల్ రెడ్డి, హెచ్ యూ జే అధ్యక్ష కార్యదర్శులు కోటిరెడ్డి, చంద్రశేఖర్,   రాష్ట్ర నాయకులు అయిలు రమేశ్, కే.రాంనారాయణ, రాజేశ్, సంపత్ కుమార్, వీణావాణి, తాటికొండ భాస్కర్, వివిధ జిల్లాల  అధ్యక్ష కార్యదర్శులు కే. ప్రబాకర్ రెడ్డి (నల్గొండ), శ్రీనివాసరావు (నల్గొండ), శ్రీనివాస్ ( మహబూబ్ నగర్) , శివకుమార్ (వరంగల్), రమణ (వరంగల్), గాండ్ల శ్రీనివాస్ ( కరీంనగర్), అంగిరేకుల సాయిలు (నిజామాబాద్), రంగాచారి(మెదక్), వెంకటేశ్వరావు, ప్రసేన్ (ఖమ్మం) , వెంకటరెడ్డి (రంగారెడ్డి), ప్రకాష్ రెడ్డి (మంచిర్యాల) , మహేందర్ రెడ్డి (ఆదిలాబాద్) తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *