డీపీవోలు, ఈవో పీ అర్డిలకు మంత్రి ఎర్రబెల్లి ఆదేశం

పల్లెలు వికసించాలి
అధికారుల కృషితోనే ఇది సాధ్యం
పంచాయతీ వ్యవస్థలు కిలకం గ్రామాల్లోని సమస్యలను స్వయంగా పరిశీలించండి
డీపీవోలు, ఈవో పీ అర్డిలకు మంత్రి ఎర్రబెల్లి ఆదేశం

హైదరాబాద్ : ఎక్కువ మంది జీవనంతో ముడిపడి ఉండే పల్లెలు అభివృద్ధితో వికసించాలని పంచాయతీరాజ్ , గ్రామీణాభివృద్ధి , మిషన్ భగీరధ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు . పల్లెల అభివృద్ధిలో పంచాయతీరాజ్ , గ్రామీణాభివృద్ధి అధికారులది కీలకపాత్ర అని చెప్పారు. జిల్లా పంచాయతీ అధికారులు , ఈవోపీఅర్డి సంఘాల ప్రతినిధులు వేర్వురుగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును హైదరాబాద్ లోని మంత్రి నివాసంలో మంగళవారం కలిశారు . పలు అంశాలపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వారితో చర్చించారు. పంచాయతీరాజ్ వ్యవస్త ఎంతో కీలకమైనది. గ్రామాల్లోని చాలా అంశాలు ఈ శాఖ పరిధిలోనే ఉంటాయి. పంచాయతీరాజ్ అధికారులు , సిబ్బందిపై ప్రభుత్వంలో మంది అభిప్రాయం ఉంది. ఎన్నో కార్యక్రమాల్లో మీరు కీలకంగా వ్యవహరించాలి. వీలైనన్ని ఎక్కువ గ్రామాలను సందర్శించాలి. స్వయంగా సమస్యలను తెలుసుకుని పరిష్కరించాలి. కిందిస్థాయి సిబ్బందిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలి. అభివృద్ధి పనులు వేగంగా పూర్తయ్యేలా చూడాలి. అధికారులు, సిబ్బందికి సంబంధించిన సర్వీసు, ఇతర అంశాలపై సానుకూలంగా నిర్ణయం తీసుకునేందుకు ప్రభుత్వం ఎప్పుడూ సుముఖంగానే ఉంటుంది. ప్రజలు ఎలాంటి ఇబ్బంది పడకుండా మరే అన్ని చూసుకోవాలి అని అన్నారు. డిపీవో సంఘం ప్రతినిధులు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు పలు అంశాలపై వినతిపత్రం అందజేశారు. ‘రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి వేల మంది కార్యదర్శులను నియమించి విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం తొమ్మిది జిల్లాలకు మాత్రమే డిసీవోలు ఉన్నారు. కొత్త జిల్లాల ప్రకారం ప్రతే జిల్లాకు ఒక పీవోను నియమించాలి. ఈవో పిఆర్ డిలకు పదోన్నతి కల్పించి పోస్టింగ్ ఇవ్వాలి. డీపీవోలకు పదోన్నతి కల్పించాలి సర్వీసు రూల్స్ ను సవరించాలి, డీపీవో కార్యాలయాలమ సిబ్బంది పరంగా బలోపేతం చేయాలి. పంచాయతీ కార్యదర్శులకు పదోన్నతి కల్పించి బదిలీలు చేయాలి. పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో పంచాయతీ విభాగాల కోసం ప్రత్యేకంగా అసిస్టెంట్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ పోస్టులను ఏర్పాటు చేయాలి అని కోరారు. డిపివోల సంఘం అధ్యక్షురాలు పద్మజ , కార్యదర్శి సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈవోపీఆర్డీలు సైతం పలు అంశాలపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు వినతిపత్రం ఇచ్చారు. ‘చాలా కాలంగా బదిలీలు జరగాల్సి ఉంది. వీటిని వెంటనే పూర్తి చేయాలి. 2018లో ప్రభుత్వం బదిలీలు చేసినా సాధారణ ఎన్నికల కారణంగా పెంచాయితీ ఉద్యోగులకు బదిలీల అవ కల్పించలేదు. ఈవోపీఆర్డిలకు వెంటనే బదిలీల అవకాశం కల్పించాలి’ అని కోరారు. ఈవో పిఆర్ డీల సంఘం ఆధ్యక్షుడు రంగాచారి, కార్యదర్శి యాదగిరి గౌడ్ , జి .శంకర్ తదితరులు మంత్రికి వినతిపత్రం ఇచ్చారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *