డీజీపీకి టీయుడబ్ల్యుజె ఫిర్యాదు

రాష్ట్రంలో మీడియా స్వేచ్ఛపై, జర్నలిస్టులపై కొనసాగుతున్న దాడులను, బెదిరింపులను అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ)ని కలిసి తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(టీయుడబ్ల్యుజె), ప్రెస్ క్లబ్ హైదరాబాద్(పిసిహెచ్) ప్రతినిధి బృందం శుక్రవారం నాడు వినతి పత్రాన్ని అందించింది. కొన్ని శక్తులు పథకం ప్రకారం మీడియా స్వేచ్ఛను హరించేందుకు కుట్రలు చేస్తున్నట్లు వారు ఆరోపించారు. తాజాగా ఎన్టీవీ ప్రతినిధి రెహానాపై విశ్వహిందు పరిషత్ బాధ్యుడొకరు సోషల్ మీడియాలో చేసిన అభ్యంతకరమైన వ్యాఖ్యలు, హెచ్చరికను ఈ సందర్భంగా వారు డిజిపి దృష్టికి తీసుకెళ్లారు. ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజేయూ) అధ్యక్షులు దేవులపల్లి అమర్, టీయుడబ్ల్యుజె రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ, ఉప ప్రధాన కార్యదర్శి విష్ణుదాస్ శ్రీకాంత్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎ.రాజేష్, హైదరాబాద్ ప్రెస్ క్లబ్ కార్యదర్శి రాజమౌళి చారీ, హెచ్.యు.జె. అధ్యక్ష, కార్యదర్శులు రియాజ్ అహ్మద్, శిగ శంకరగౌడ్ తదితరులు డిజిపిని కలిశారు.

amer 1

About The Author

Related posts