డీకే అరుణ భర్తకు 33 కోట్ల జరిమానా

హైదరాబాద్ : అక్రమ మైనింగ్ లో మాజీ మంత్రి డీకే అరుణ కుటుంబానికి  హైకోర్టులో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. అప్పట్లో డీకే అరుణ భర్త భరతసింహారెడ్డికి సంబంధించి అక్రమక్వారీలపై హైకోర్టులో పిటీషన్ దాఖలు కాగా.. విచారణ చేపట్టింది. ఈ కేసులో న్యాయస్థానం తుది తీర్పు వెలువరించింది. మహబూబ్ నగర్ లో ఆయనకు చెందిన క్వారీల పనులను తక్షణమే నిలిపివేయాలంటూ స్టే విధించింది. మైనింగ్ కేసులో రూ.33 కోట్ల జరిమానా చెల్లించాల్సిందేనని ఆదేశించింది. కింది కోర్టు విధించిన జరిమానా వసూలు చేయడం లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారుల తీరుపైనా ధర్మాసనం తీవ్రస్థాయిలో ప్రశ్నించి వెంటనే జరిమానా వసూలు చేయాల్సిందిగా కోరింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *