
హైదరాబాద్ : తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క తన వాక్య్చాతుర్యంతో టీఆర్ఎస్ నేతలను కడిగిపారేశారు. సోమవారం ఆయన బడ్జెట్ పై చర్చ సందర్బంగా మాట్లాడారు. ఈటెల బడ్జెట్ గతంది కాపీ కొట్టాడని.. ఆయన ఎవరో రాస్తే చదివేడాని.. ఆయన తయారు చేసింది కాదని సెటైర్ వేశాడు.
అనంతరం భట్టి మాట్లాడుతూ ప్రభుత్వం హైదరాబాద్ లో షీ టీంలు పెట్టి మహిళల రక్షణకు పాటుపడుతోందని.. కానీ రాష్ట్ర అసెంబ్లీలోనే ఒక మహిళ ఎమ్మెల్యే డీకే అరుణను టీఆర్ఎస్ నాయకులు ఇవ్ టీజింగ్ చేసి ఆమెను నానా మాటలు అన్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.